సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంకు చెందిన దళితులకు సదాశివపేట తహసిల్దార్ కార్యాలయం వారు 9 ఇండ్ల స్థలాల(ప్లాట్లు)ను, వెంకటాపురం , ఇశ్రితాబాద్ మరియు పలు గ్రామాలకు రోడ్డు నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన జంగిలి అంజయ్య, జంగిల్ బాగయ్య, జంగిలి రామస్వామి, జంగిలి మల్లేశం, జంగిలి అనసూయ, జంగిలి అనసూయ, జంగిలి శాంతమ్మ , జంగిలి లక్ష్మి, జంగిలి బాగమ్మ వారికి 70 గజాల ఇండ్ల స్థలాలను సిద్దాపురం, సదాశివపేట సర్వేనెంబర్ 260 లో పట్టాలు మంజూరు చేసి కేటాయించారు. ఇట్టి ఇండ్ల స్థలాలను కొందరు దుండగులు అక్రమనకు పాల్పడుతుంటే బాధితులు సదాశివపేట తహసిల్దార్ కార్యాలయమును సంప్రదించారు. ఇట్టి విషయంలో బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ సదాశివపేట తహసిల్దార్ వారిని కలిసి సంబంధిత ఆధారాలను పరిశీలనలోకి తీసుకొని దళితులకు న్యాయం చేకూర్చండి అని తెలియజేశారు. ఇట్టి విషయంలో సదాశివపేట తహసిల్దార్ గారు సంపూర్ణ న్యాయం దళితులకు చేకూరుస్తామని తెలియజేశారు. అదేవిధంగా శాంతి భద్రతలను కాపాడుటకు ఇట్టి విషయాన్ని ప్రత్యుత్తరం ద్వారా సమాచార నిమిత్తం కోసం సదాశివపేట పోలీస్ కార్యాలయంలో బాధితులు అయినా దళితులు తెలియజేశారు. దళితులకు న్యాయం జరిగేలా చూడాలని మల్లారెడ్డి గారు, టిఆర్ఎస్ నాయకులు మహమ్మద్ ఖజ , బాధితులు జంగిలి అంజయ్య, జంగిలి మల్లేశం, జంగిలి సంగమేష్, జంగిలి లక్ష్మి, మరియు మహిళలు సదాశివపేట తహసిల్దార్ గారిని, సదాశివపేట సిఐ గారికి విజ్ఞప్తి చేశారు.