ఐరోపాలోని స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, లిక్టన్‌స్టైన్ దేశాలతో యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య అసోషియేషన్(ఈఎఫ్‌టీఏ) ఒప్పందానికి భారత్ అంగీకారం చేసుకుంది. దీంతో రాబోయే 15 ఏళ్లలో దేశంలో 100 బిలియన్ డాలర్ల ఫారిన్ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా దేశ ఆర్థిక ప్రగతిని పెంపొందించడమే కాకుండా యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు అవకాశముందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.