విద్యార్థులను అన్ని రంగాల్లో ముందుంచుతున్నా ఉపాధ్యాయులు* నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం లింగసానిపల్లి గ్రామంలో గ్రామ ప్రజల సహకారం విద్యార్థుల సహకారంతో *
ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల వార్షికోత్సవం ప్రవేట్ పాఠశాలకు ధీటుగా ఘనంగా జరిగింది*. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డీ.ఈ.వో. గోవిందరాజులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సకల సదుపాయాలు విద్యార్థులకు ఉన్నాయని ప్రైవేట్ పాఠశాలల కన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కల విద్యార్థులు చాలామంది ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల కొరతను. మూడు అదనపు గదులు. పాఠశాల కోసం గ్రౌండ్. బాత్రూంలు. పాఠశాలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను తక్షణమే అధికారులతో మాట్లాడి వెంటనే కల్పిస్తానని అన్నారు. ప్రియతమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పించడంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది అన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సంస్కృతి కార్యక్రమాలు చాలా ఆకట్టుకున్నాయని. ప్రతి విద్యార్థులను ఎంతో ప్రతిభను వెలికితీసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగయ్య. హెచ్ఎం చంద్రశేఖర్. పాఠశాల ఉపాధ్యాయిని. ఉపాధ్యాయులు. విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు