తనను తాను పూర్తిస్థాయి హీరోగా నిరూపించుకున్న తర్వాతే తన తండ్రి డైరెక్షన్‌లో సినిమాలు చేస్తానని ఆకాశ్ పూరి తెలిపాడు. తన తండ్రి, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని పేర్కొన్నాడు. ‘‘ఏదో ఒకటి చేసేయాలని కాకుండా మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనుకుంటా. అందుకే గ్యాప్ వస్తోంది. చాలా స్క్రిప్టులు వింటున్నా. మూడు కథలు ఎంపిక చేశా. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తా’’ అన్నాడు.