రాచకొండ కమిషనరేట్ లిమిట్స్ లో వివిధ పోలీస్ స్టేషన్ పరిదిలలో దొంగతనాలకు పాల్పడిన కేసులలో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద రికవరీ చేసిన సొత్తును బాధితులకు తిరిగి అందజేసే కార్యక్రమాన్ని తెలంగాణా రాష్ట్రంలో మొదటిసారిగా రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ నిర్వహించారు
రాచకొండ కమిషనరేట్ :- దొంగతనం బాధితుల్లో పోలీసులపై విస్వాసం నెలకొల్పేందుకు రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 23 చోట్ల దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతున్న అంతరాష్ట్ర దోపిడి ముఠాను అరెస్ట్ చేసి వారివద్దనుండి మొత్తం 41 లక్షల 15 వేల రూపాయల విలువ చేసే 120 తులాల బంగారు నగలు, నాలుగు మోటారు సైకిల్స్, 6 ఎల్.ఈ. డి టివిలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులను బాధితులకు అందజేశారు. దీనివలన బాధితులకు వెంటనే న్యాయం జరిగి కాస్త ఊరట లభిస్తుందని కమీషనర్ తెలిపారు. కోర్టు ద్వారా రికవరీ సొత్తును అందజేయడానికి ఆలస్యం అవుతుందనే కారణంతో ఇకనుండి ఇదేవిధంగా రికవరీ జరగగానే బాధితులకు అందజేస్తామని రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు.