9 మంది జర్నలిస్టుల పై ఎందుకు..యావత్తు జర్నలిస్టులందరిపై కేసులు పెట్టండి..జైలుకు వెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులు సిద్ధం….
ప్రజాస్వామ్య మనుగడకు ఓటు అనేది పునాది.. ఆ ఓటు విలువ గురించి తమ ప్రసార, ప్రచురణ మాధ్యమాల ద్వారా ఓటర్లను చైతన్యులను చేసి పోలింగ్ బూతుల వరకు వెళ్లేలా చేస్తున్న జర్నలిస్టులు వారు వేసిన ఓటు ఫలితాలు వెల్లడయ్యే వరకు డేగలా కాపలా కాయడం తమ విధి. ఓటర్ల తీర్పును భద్రపరిచే యంత్రాల పట్ల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడం తప్పా? అది తప్పు అని చెబితే కేసులు పెడతారా? జర్నలిస్టులు చేసింది తప్పయితే, సమయం, సందర్బం లేకుండా రాత్రి వేళల్లో ఈవీఎంలను తరలించడం తప్పు కాదా? జర్నలిస్టులు ఫోటోలు తీసి, వార్తలు రాయడం తప్పా? అది విధులకు ఆటంకం కల్పించినట్లవుతుందా? ఇదేమీ ప్రజాస్వామ్యం. ఓటర్ల జాబితాలో ఓట్లు గల్లంతు అయ్యింది నిజమేనని సారీలు చెబితే సరిపోతుందా? తమ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి జర్నలిస్టులను బలి చేస్తారా? మీరు కేసులు పెట్టింది 9 మంది పైనే.. మీ విధానాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్న మా జర్నలిస్టులందరిపై కేసులు పెట్టండి. సంకెళ్లు వేసుకుని జైళ్లకు వెళ్లేందుకు సిధ్ధంగా ఉన్నాం. ప్రజాస్వామ్య వాదుల్లారా జర్నలిస్టులపై పెట్టిన కేసులపై గళం విప్పండి.. ఎక్కడికక్కడే ఖండించండి..జర్నలిస్టులకు అండగా నిలవండి. జై జర్నలిస్ట్ జై జై జర్నలిస్ట్ , జర్నలిస్టుల ఐక్యత వర్థిలాలి …