ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించేందుకు సమయం కావాలన్న ఎస్బీఐ అభ్యర్థనపై ఈ నెల 11న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వీటికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఎస్బీఐని సుప్రీం ఆదేశించింది. జూన్ 30 వరకు గడువు పెంచాలని కోరుతూ ఎస్బీఐ పిటిషన్ వేసింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ ఏపీ వ్యాప్తంగా ఈ నెల 11న ఎస్బీఐ బ్రాంచీల వద్ద సీపీఎం నిరసనలు చేపట్టనుంది.