పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. శనివారం మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజాదీవెన సభ నిర్వహించనుంది. గుండ్లపోచంపల్లిలో సభకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 11న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి ప్రజాదీవెన పేరుతో మణుగూరులో సభను ఏర్పాటు చేయనుంది. ప్రజాదీవెన సభల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొనున్నారు.