తాను బీఆర్ఎస్ పార్టీని వీడటం లేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు క్లారిటీ ఇచ్చారు. మంగళవారం భద్రాచలం మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల అవసరాలు, అభివృద్ధి కోసం తాను ఎన్నిసార్లైనా సీఎం, మంత్రులను కలుస్తానన్నారు. పార్టీ మారుతున్నట్లుగా వచ్చిన వార్తలను పూర్తిగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.