జింకను చంపి పార్టీ చేసుకున్న తెలంగాణ యువకుడు.. కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు

Image result for deer eating human bones
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి యాలాల్ మండలం భానపూర్ గ్రామానికి చెందని శేఖర్ అనే యువకుడు ఓ జింకను వేటాడాడు. అనంతరం దాన్ని చంపి పార్టీ చేసుకున్నాడు. ఈ ఘటనపై రహస్య సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు శేఖర్ ఇంటిపై దాడిచేశారు.

ఈ సందర్భంగా జింక తల, కాళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో శేఖర్ పై వణ్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదుచేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నెమళ్లు, జింకలు వంటి జీవులను వేటాడటంపై ప్రభుత్వాలు నిషేధం విధించాయి. మరోవైపు శేఖర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *