ఇటీవల గన్నేరువరం మండలకేంద్రంలో అక్రమ ఇసుక డ్రంపులను పట్టుకున్న గన్నేరువరం రెవెన్యూ శాఖ అధికారులు గ్రామ శివారులోని భూమిడి చింతల వద్ద నాలుగు ట్రాక్టర్ల ఇసుక మరియు కూన కొమురయ్య,తండ్రి నర్సయ్య,ఖాళీస్థలం వద్ద రెండు ట్రాక్టర్ల ఇసుక,దుర్మాట్ల కిట్టు తండ్రి లింగయ్య ఇంటి ముందు మూడు ట్రాక్టర్ల ఇసుక కొలుపుల మల్లయ్య ఖాళీస్థలం నందు ఒకటి ట్రాక్టర్ల ఇసుక మునిగంటి చంద్రయ్య ఖాళీస్థలం నందు రెండు ట్రాక్టర్ల ఇసుక మరియు బత్తని నర్సయ్య ఖాళీస్థలం నందు ఒకటి ట్రాక్టర్ల ఇసుక మొత్తం 13 ట్రాక్టర్ల ఇసుక కుప్పలను పంచనామా నిర్వహించి ప్రభుత్వం స్వాధినములోకి తీసుకొన్నారు ఇట్టి ఇసుక వేలం వేయటకు నిర్ణయించారు వేలం వేసే తేదీ 22-04-2019 రోజున ఉదయం 11-00 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేయనట్లు తహసీల్దార్ గుడ్ల ప్రభాకర్ తెలిపారు