లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్దమవుతోంది. నేడు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది. సోమవారం ఉదయం 11 గంటలకు మొదటి జాబితాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించనున్నారు. కాగా, ఖమ్మం, మహబూబాబాద్ బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. లోక్ సభ ఎన్నికల కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.