గాజువాక వైసీపీలో ఇన్ఛార్జ్ మార్పుతో మొదలైన వర్గపోరు తీవ్రరూపం దాల్చింది. వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకూటి రామచంద్రరావు ఆధ్వర్యంలో గాజువాకలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య సహా పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తీరుపై బహిరంగంగా ధ్వజమెత్తారు. ఇతర నియోజకవర్గాలకు చెందిన వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు