బెంగళూరు పేలుడు కేసు దర్యాప్తు NIAకు బదిలీ..

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌‌లో మార్చి 1న పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు కేసు దర్యాప్తును అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని కేఫ్‌లో IED పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పేలుడు ఘటనలో 9 మందికి పైగా గాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *