‘జపాన్ రావాలని నా చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. అది ఇలా సాధ్యమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇకపై ప్రతి ఏడాదీ ఇక్కడికి వస్తాను’ అంటూ ఆ దేశంపై తనకున్న ప్రేమను రష్మిక వ్యక్తపరిచారు. ‘క్రంచీ రోల్ అనిమే’ ప్రపంచంలోని సృష్టికర్తల్లో ఒకరికి అవార్డును అందించే అవకాశం లభించిందని తెలిపారు. ఈ ఈవెంట్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉందని, అభిమానుల ప్రేమను పొందడం అదృష్టంగా భావిస్తున్నానని రష్మిక తెలిపింది.