పట్టించుకునే నాధుడే లేడా? ఎంతోమంది ప్రాణాలు పోతున్న చర్యలు తీసుకొని అధికారులు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ టర్నింగ్ దగ్గర నడిరోడ్డు మీద ఉన్న స్వర్గీయ శ్రీ రాజ శేఖర్ రెడ్డి గారి విగ్రహం రోడ్డు మధ్యలో హోటల్ వాళ్ళు.పండ్లబళ్లను ఇలా రోడ్డుపై ఉంచి వెళ్తున్నారు. థాయ్ బజార్ రుసుము చెల్లిస్తున్నారు కదా అని అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతి వారం లో ఏదో ఒకరోజు ఏక్సిడెంట్ లు జరగడం. ప్రాణాలు పోవడం జరుగుతుంది. ఎంతో మంది బైక్ వాళ్ళు సడన్ గా బ్రేక్ లు వేసి జారి పడడం జరుగుతుంది. ఇన్ని జరుగుతున్నా హోటల్ వాళ్ళు. పండ్ల దుకాణదారులు. తమ తోపుడు బళ్ల ను రోడ్డు పై ఇలా ఉంచి వెళ్తున్నారు. ఇది ఎవరికి ఏమైతే మాకేంటి అని అందరు ఊరుకుంటున్నారు. ఇలా చేస్తే ఎంతమందికి ఇబ్బంది జరుగుతుందనేది ఆలోచించడం లేదు. మున్సిపాలిటీ వాళ్ళు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అలాగే సిసి రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికీ నోటీస్ లు ఇచ్చి ప్రమాదాలు కాకుండా ప్రజలను కాపాడాలని కల్వకుర్తి లోని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.