ఈ 3నెలల్లో భారీ ఎండలు: IMD హెచ్చరిక..

దేశంలో ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతాయని, ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తర కర్ణాటకతో పాటు పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిప్పుల ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *