కేంద్ర ప్రభుత్వంలోని మరికొన్ని కీలక స్థానాలను త్వరలో ప్రైవేట్ నిపుణులతో భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో 25 మంది నియామకానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ముగ్గురు జాయింట్ సెక్రటరీలుగా, 22 మంది ప్రైవేట్ వ్యక్తులను డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీలుగా నియమించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఎవరిని ఎంపిక చేస్తారనేది త్వరలో ప్రకటించనున్నారు.