విద్యార్థుల ప్రాణ త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణ – విద్యార్థులను చిన్నచూపు చూస్తుంది

విద్యార్థుల ప్రాణ త్యాగాల వల్ల వచ్చిన  తెలంగాణ విద్యార్థులను  చిన్నచూపు చూస్తున్న  ప్రభుత్వంపై ధ్వజ మెత్తిన భారతీయ విద్యార్థి సేన** నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట  పట్టణ కేంద్రంలో  ఇంటర్ ఫలితాల విషయంలో  రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి పట్ల భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిరసన. ఈ రోజు  అమరవీరుల స్తూపం వద్ద కల్లకు గంతలు కట్టుకుని,చెవిలో పువ్వులు పెట్టుకుని విన్నూత నిరసన కార్యక్రమం నిర్వాహంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సింకార్ శివాజీ మాట్లాడుతూ
* ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత వహించి వెంటనే విద్యా శాఖ మంత్రి  జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని  అని డిమాండ్ చేశారు. దీనికీ సంబంధించిన ప్రతీ ఒక్కరినీ సస్పెండ్ చేయ్యాలి,* ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలీ, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 20 లక్షల రూపాయలు ఇచ్చి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. లేకపోతే ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాడమని. భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవేందర్. యువజన జిల్లా అధ్యక్షులు వినోద్. బి వి ఎస్ అచ్చంపేట తాలూకా అధ్యక్షులు అఖిల్. సాయి. అజయ్. మారుతి. శివ.  కార్తీక్. తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *