రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీ లు ఐక్యమైతేనే రాజ్యాధికారం సాధించవచ్చని బిసి రక్షక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కా చంద్రమోహన్ ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాధికార సాధనకు బీసీలందరినీ ఐక్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపులో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని, అందుకోసం బీసీ అభ్యర్థులు లేకుండా గెలిచే అవకాశాలున్న చోట స్వతంత్రంగా పోటీచేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జక్క మాట్లాడుతూ.. దేశంలో 70 ఏళ్ల నుంచి అసమానతలు తొలగిపోవాలని ఎన్నో పోరాటాలు జరుగుతు న్నా అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయన్నారు.
ఎస్సీ,ఎస్టీ,బీసీల్లో ఐకమత్యం లేకపోవడం, సరైన నాయకుడు లేకపోవడంవల్లే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నామని అభిప్రాయపడ్డారు. బీసీల్లో ఇప్పటివరకు అసెంబ్లీ మెట్లు ఎక్కని కులాలను గుర్తించి అన్ని పార్టీలు వారికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం గూర్చి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లానని, ప్రస్తుతం ఉన్న జనాభాకు అనుగుణంగా అన్నిపార్టీలు బీసీల వర్గీకరణ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశా రు. ఎంబీసీ కులాలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మల్లేష్ అశోక్, అశోక్ అంజీ శ్రీకాంత్ తదితరులు బీసీ నాయకులు పాల్గొన్నారు