కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం రోజున నిర్వహించిన 2019 సాధారణ ఎన్నికలకు ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు స్వీకరణ షెడ్యూల్ విడుదల చేశారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జడ్పీటీసీ ఒకటి,ఎంపీటీసీ 6 స్థానాలు ఈనెల 26 తేదీ నుంచి 28 తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ 29 వ తేదీన నామినేషన్లు పరిశీలన సాయంత్రం 5 గంటల వరకు ,29వ తేదీ అదే రోజున నామినేషన్లు చెల్లు బాటైన జాబితా 5 గంటల వరకు 30వ తేదీన అప్పీల్స్ ,మే 1వ తేదీన అప్పీల్స్ పరిష్కారం ,మే 2 వ తేదీన నామినేషన్లు ఉపసంహరణ మే 10 వ తేదీన పోలింగ్ ఉంటుందని ఎన్నికల అధికారి గన్నేరువరం ఎంపీడీఓ ఎం శ్రీనివాస్,మండల ఏఆర్ వో బి శేఖర్,కొమురయ్య, తెలిపారు