సిద్ధిపేట జిల్లా బెజ్జంకి : మండలం లోని తోటపల్లి గ్రామానికి చెందిన సొళ్ళు ప్రియదర్శిని (sc మాల)దళిత బిడ్డ మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్ పూర్తిచేసి బైపిసి గ్రూప్ లో 891 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచింది.
ప్రియదర్శిని తండ్రి గత సంవత్సరం దుబాయ్ దేశంలో కూలిపని చేసుకుంటూ గుండెపోటుతో మరణించాడు. తల్లి కొట్టు పనిచేసుకుంటూ కూతురిని డాక్టర్ చేయాలని నిశ్చయంతో చదివిస్తుంది తల్లి మాటను జావాదాటాని కూతురు కష్టాలను సైతం లెక్కచేయకుండా ఆత్మస్థైర్యంతో సమస్యలను ఎదుటించి మండలంలో టాపర్ గా నిలిచింది.
నేడు వారి నివాసంలో దళిత సంఘాలు జిల్లా నాయకులు వెన్న రాజు మరియు తెలంగాణ మాల మహానాడు మండల అధ్యక్షులు రాసురి మల్లికార్జున్, అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఎలుక ఆంజనేయులు ,ర్యాకాం రాజు వెన్న రాజు తదితరులు సన్మానించారు.
మునుముందు ఉన్నత విద్య కోసం సహాయం చేస్తామని హామీ ఇచ్చారు