ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ.. పలువురు కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. తాజాగా టీడీపీ పులివెందుల మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి శుక్రవారం వైసీపీలో చేరనున్నారు. 20 ఏళ్ల పాటు సతీష్ రెడ్డి టీడీపీలో కొనసాగారు. ఇవాళ తాడేపల్లిలో ఆయన తన అనుచరులతో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరుతారు.