గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ఏ-10 నిందితుడిగా ఉన్న డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నాడని తెలిపారు. ఇప్పటికే ఆయనకు సీఆర్పీసీ 160 నోటీసులు జారీ చేశామని కోర్టుకు రిపోర్టు చేశారు. కాగా ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఏ11గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్, ఏ12గా డ్రగ్ సప్లయర్ మీర్జా వహీద్ బేగ్ పేర్లను చేర్చారు.