తెలంగాణలో ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డులు త్వరలోనే మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా అమలుచేసి తీరతామన్నారు. ధరణిలో వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వందల సంఖ్యల్లోనే రెండు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారని, తాము అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు.