మైదానంలోనే కొట్టుకున్న చైనీస్‌ తైపీ బేస్‌బాల్‌ ఆటగాళ్లు

కరోనా కారణంగా స్టేడియంలో ఆటగాళ్లే ఉన్నారు. ప్రేక్షకుల్ని అనుమతించలేదు. ఈలగోలల్లేని మైదానంలో ఎంచక్కా ఆడుకోవాల్సిన ఆటగాళ్లు దెబ్బలాడుకున్నారు. ఈ తగువులాటలో భౌతిక దూరం సంగతే మరిచారు. మ్యాచ్‌ ప్రసారం కావాల్సిన టీవీల్లో కొట్లాట ‘ప్రత్యక్ష’ ప్రసారమైంది. చైనీస్‌ తైపీ బేస్‌బాల్‌ లీగ్‌లో భాగంగా ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. రకుటెన్‌ మంకీస్, ఫుబొన్‌ గార్డియన్స్‌ జట్ల మధ్య బేస్‌బాల్‌ మ్యాచ్‌ ప్రేక్షకుల్లేకుండా జరిగినా … ఇరుజట్ల ఆటగాళ్ల తగవుతో అల్లరిపాలైంది. భౌతిక దూరం పాటించాలనే ఉద్దేశంతో ఎవరినీ అనుమతించని స్టేడియంలో… విచక్షణ మరిచి ఒకరిమీద ఒకరుపడి మరీ కొట్టుకోవడం తైపీ వర్గాల్ని కలవరపెట్టింది. ఇక ఈ ద్వీప దేశం బేస్‌బాల్‌ తగవుతో వార్తల్లోకెక్కినా… ప్రపంచాన్నే వణికిస్తున్న వైరస్‌నే పకడ్బందీ చర్యలతో కట్టడి చేసిన దేశంగా కితాబులందు కుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *