ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొణిజర్ల గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రధాన అనుచరుడు సూరంపల్లి రామారావుపై గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సూరంపల్లి రామారావుకు తీవ్ర గాయాలయ్యాయి. భూ వివాదాల వల్లే ఈ దాడి జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.