కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ల పర్వం మొదలైంది మూడు రోజుల పాటు జరగనున్న నామినేషన్ల స్వీకరన అన్ని మండలాలలో మొదలయ్యాయి గన్నేరువరం మండలకేంద్రంలో ఈ రోజు ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణలో భాగంగా మొదటి రోజు గునుకుల కొండాపూర్ టిఆర్ఎస్ ఎంపిటిసి అభ్యర్థి గూడెల్లి అంజనేయులు పారువెల్ల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ ఎంపిటిసి అభ్యర్థి పీచు దివ్య గన్నేరువరం ఎంపిటిసి బీజేపీ అభ్యర్థి వెదిర అనిత లు నామినేషన్లు వేశారు మిగతా అభ్యర్థులు వారి వారి పరిస్థితులను బట్టి వారి అనుచరులతో ఈ మూడు రోజుల్లో నామినేషన్లు వేయనున్నారు అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్లే దారిలో ఎలాంటి అవాంతరాలు కలిగించే కార్యక్రమాలను చేయరాదని సౌండ్ బాక్సు లతో కూడిన ర్యాలీలు నిర్వహించరాదని స్థానిక ఎస్సై వంశీకృష్ణ ముందే హెచ్చరించి తగిన భద్రత ఏర్పాట్లను చేశారు నామినేషన్ కార్యాలయం ఇన్చార్జ్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా తగు జాగ్రత్తలను తీసుకుంటున్నామని మీడియాకు తెలిపారు
