తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం వెలువడే ఛాన్స్ ఉంది. మే 3వ వారంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. పది రోజులపాటు పరీక్ష నిర్వహించే వీలుందని… ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ కూడా ఖరారైనట్లు సమాచారం. మొత్తం 11,062 టీచర్ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. దీంతో నోటిఫికేషన్ వెలువడనుంది.