‘కల్కి 2898 ఏడీ’ నుండి ప్రభాస్ ఫొటో లీక్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది ‘సలార్’తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రభాస్‌తో పాటు ఆయన అభిమానుల ఆకలిని తీర్చింది. బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అబ్బరపరచింది. ఇందులో దర్శకుడు ప్రశాంత్ నీల్ తన మార్క్ చూపించాడనే చెప్పాలి.

 

ఇక అదే జోష్‌లో ప్రభాస్ ఇప్పుడు మరొక భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్‌ సినిమాపై ఎనలేని అంచనాలను పెంచేశాయి.

 

ముఖ్యంగా గ్లింప్స్‌లో ప్రభాస్ లుక్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్ చూసిన ప్రేక్షకులకు అలాగే ఫ్యాన్స్‌కు హాలీవుడ్ మూవీ చూసినంత ఫీలింగ్ వచ్చినట్టయింది. దీంతోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. సైన్స్, పురాణాలు అన్నీ కలిపి ఈ మూవీలో చూపించబోతున్నారు.

 

కాగా ఇందులో భారీ తారాగణం నటిస్తోంది. టాలీవుడ్ నుంచి రానా, కోలీవుడ్ నుంచి స్టార్ హీరో కమల్ హాసన్, అలాగే బాలీవుడ్ నుంచి బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీతో పాటు మరికొంత మంది నటీ నటులు ఇందులో భాగం కాబోతున్నారు.

 

ఇక ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఎన్ని కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో ఒకటి లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా అలాంటిదే ఈ మూవీ నుంచి మరో ఫొటో లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కూడా ప్రభాస్ ఫొటో కావడం విశేషం. ఆ ఫొటోలో ప్రభాస్ లుక్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.

 

చేసినట్లు చెప్పుకొచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *