కల్వకుర్తి పట్టణంలో TRS పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మహబూబ్ నగర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి నేటికి 18 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా TRS పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ జెండాను మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం ఎగురవేశారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్ ,తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కేసీఆర్ కీలక పాత్ర పోషించారని . ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామంటే అందరి కృషితో పాటు,కేసీఆర్ గారి పట్టుదల,వారు ప్రాణాలు పనంగా పెట్టి,ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించారు అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ షాహీద్, వైస్ ఎంపీపీ పర్వతాలు గౌడ్,PACS వైస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి,మాజీ ఎంపీపీ మాధవయ్య,TRS పార్టీ మాజీ ఇంచార్జి బాలాజీ సింగ్,TRS పార్టీ యువజన నాయకులు ఎడ్మ సత్యం,TRS పార్టీ మండల అధ్యక్షులు విజయ్ గౌడ్ TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.