తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది. జూన్ 9న ప్రిలిమినరీ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటించింది. మొత్తం 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల టీఎస్ పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 23న మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 14 వరకు కొనసాగనుంది. గతంలో గ్రూప్-1 కు దరఖాస్తు చేసుకున్న వారు మరో మారు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు అవకాశం ఇచ్చింది. కాగా, సెప్టెంబర్/అక్టోబర్‌లో మెయిన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు: డిప్యూటీ కలెక్టర్ 45 పోస్టులు, డీఎస్పీ 115, సీటీవో48, ప్రాంతీయ రవాణా అధికారి 4, జిల్లా పంచాయతీ అధికారి 7, జిల్లా రిజిస్ట్రార్ 6, జైళ్లశాఖలో డీఎస్పీ 5, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ 8, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ 41, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3, జిల్లా బీసీ అభివృద్ధికారి 5, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి 2, జిల్లా ఉపాధి అధికారి 5, పరిపాలనా అధికారి (వైద్యారోగ్యశాఖ) 20, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్-38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 41, మండల పరిషత్ అభివృద్ధి అధికారి 140.