తెలంగాణలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు ఈనెల 29తో ముగియనుంది. జనవరి 31నే ముగియాల్సి ఉండగా ఫిబ్రవరి 29 వరకు పొడిగించారు. రేషన్ కార్డులోని లబ్ధిదారులందరూ రేషన్ షాపుల్లో వేలిముద్రలు సమర్పించాల్సి ఉంటుంది. మరణించిన, పెళ్లి చేసుకున్నవారి పేర్లు కార్డుల్లో నుంచి తొలగించకపోవడంతో ప్రభుత్వం E-KYC విధానం తీసుకువచ్చింది. ఈ-కేవైసీ చేసుకోనివారికి రేషన్ కట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. మరి మీరు ఈ-కేవైసీ చేసుకున్నారా? కామెంట్ చేయండి.