అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ఛార్జీలు నగరంలోని పేదలకు గుదిబండగా మారాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 150 గజాల స్థలానికి ఇంటి నిర్మాణ అనుమతి కావాలంటే రూ.10 లక్షల రుసుము చెల్లించాల్సి వస్తోంది. వంద గజాల స్థలమైనా సరే.. కనిష్టంగా రూ.5 లక్షల ఛార్జీ పడుతోంది. దీంతో 99 శాతం మంది బస్తీవాసులు అనుమతి లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నారు.