ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఆదేశించారు. ధరణి పోర్టల్ ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు ఇచ్చారని సిఎం ప్రశ్నించారు. లక్షలాది రైతుల భూరికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారని సీఎం అన్నారు. గోప్యంగా ఉండాల్సిన వివరాలు ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు