తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ.80 కోట్ల విడుదలకు అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500 సిలిండర్ పథకాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. సిలిండర్ కు మొత్తం ధర చెల్లిస్తే.. రూ.500 పోను మిగతా నగదు లబ్దిదారుల ఖాతాలో సబ్సిడీ రూపంలో జమ చేస్తారు.