ప్రపంచంలోని ప్రముఖులంతా తన స్నేహితులేనని క్రైస్తవ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎన్నో సార్లు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ, ఆయన గురించి తెలియని వారు ఆయన వ్యాఖ్యలను తేలికగా తీసుకుంటుంటారు. ఆయన స్థాయి ఏంటో తెలియజెప్పే ఘటన ఇప్పుడు శ్రీలంకలో జరిగింది.
శ్రీలంకలో ఉగ్రదాడి తర్వాత అక్కడ శాంతిని నెలకొల్పేందు కేఏ పాల్ అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా పాల్ ను శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ఆయన పాత స్నేహితుడు మహీంద రాజపక్స తన నివాసానికి ఆహ్వానించారు. పాల్ కు అతిథి మర్యాదలు చేశారు. గతంలో సునామీ కకావికలం చేసినప్పుడు ఆ దేశానికి పాల్ తన ఛారిటీ నుంచి భారీ సాయాన్ని అందజేశారు. ఈ సాయాన్ని రాజపక్స గుర్తుంచుకున్నారు. మరోవైపు, తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కూడా శ్రీలంక నుంచి పాల్ స్పందించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.