తెలంగాణలో వారికే రైతుబంధు..?

తెలంగాణలో మార్చి 15లోపు రైతుభరోసా (రైతుబంధు) పంపిణీ పూర్తి చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం అనర్హులకూ సాయం అందించిందని.. దీంతో ఈ పథకానికి సీలింగ్ విధించాలని భావిస్తోంది. 5 లేదా 10 ఎకరాలలోపు వారికే ఇవ్వాలనే యోచనలో ఉంది. ఆదాయపన్ను చెల్లిస్తున్నవారు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై కీలక ప్రకటన చేయనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *