ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలపై సమగ్ర న్యాయవిచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిసి రక్షక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కా చంద్ర మోహన్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంటర్ బోర్డును సమూలంగా ప్రక్షాళన చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారమివ్వాలని విజ్ఞప్తి చేసింది. విద్యార్థుల భవితవ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వపరంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతమున్న గ్లోబరీనా సంస్థ టెండర్ రద్దు చేయాలని, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఫలి తాల వెల్లడి జవాబుదారీగా వ్యవహరించాల ని, ప్రభుత్వ టెక్నాలజీ సహకారాన్ని తీసు కోవాలని కోరారు. ఇతర ప్రవేశపరీక్షలకు నష్టం కలగకుండా టైం బౌండ్‌గా తిరిగి పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలని సూచించారు.