టీజీ కీర్తి దర్శకత్వంలో వెన్నెల కిశోర్ హీరోగా నటించిన చిత్రం ‘చారి 111’ మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సుమంత్‌తో మళ్లీ మొదలైంది మూవీ తీసే సమయంలోనే వెన్నెల కిశోర్‌కి చారి 111 స్టోరీ లైన్ చెప్పాను. ఓకే చెప్పారు. ఆయన్ను దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాశాను. స్పై కామెడీ ఫిల్మ్ జానీ ఇంగ్లీష్ తరహాలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఆలోచన ఉంది’ అని చెప్పుకొచ్చారు.