సింగరేణి సంస్థలో కొత్తగా 317 ఉద్యోగాలను నేరుగా… మరో 168 పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్లు జారీచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీచేశారు. బుధవారం సింగరేణి ఉన్నతాధికారులతో సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది సంస్థలో కారుణ్య నియామకాల కింద కనీసం మరో 1000 ఉద్యోగాలను భర్తీ చేయాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచాలని ఆదేశించారు.