‘మేం తీవ్రవాదులమా.. సంఘ విద్రోహ శక్తులమా?’: షర్మిల..

గురువారం ‘చలో సెక్రటేరియట్‌’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రరత్న భవన్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ‘ఎక్స్‌’ వేదికగా షర్మిల స్పందిస్తూ.. ‘‘పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు? పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పార్టీ కార్యాలయంలో గడపాలా? ఇది మీకు అవమానం కాదా?మేం తీవ్రవాదులమా? సంఘవిద్రోహ శక్తులమా?మమ్మల్ని ఆపాలని చూస్తున్నారంటే మీరు భయపడుతున్నట్లే. ఎన్ని ఆటంకాలు కలిగించినా నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆగదు’’ అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *