నేటి నుంచే మేడారం మహాజాతర.. ఇవ్వాళ గద్దెపైకి రానున్న సారలమ్మ..

జనం మెచ్చిన జనజాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. మేడారం మహాజాతరకు ముస్తాబయ్యింది. నేడు గద్దెపైకి సారలమ్మ రాకతో ఈ పండుగ మొదలవుతుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెనెక్కుతుంది. ఇక పూనుగొండ్ల నుంచి ఇప్పటికే పగిడిద్దరాజు బయలెల్లారు. ఇక కొండాయి నుంచి గోవిందరాజు నేడే గద్దెపైకి చేరుకుంటారు.

 

సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు ఒకేరోజు గద్దెలపైకి చేరుకుంటారు. ఇప్పటికే మంగళవారం సాయంత్రం జంపన్న మేడారానికి చేరుకున్నారు. రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి చేరుకుంటారు. ఇప్పటికే 15 లక్షల మందికి పైగా భక్తులు మేడారంలో మొక్కులు సమర్పించుకున్నారు.

 

జాతర ప్రారంభమైన మూడో రోజు జనం అధిక సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకుంటారు. అదే రోజు(ఫిబ్రవరి 23) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసైలు వనదేవతలను దర్శించుకోనున్నారు. దీంతో అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు.

 

తెలంగాణ ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో మేడారానికి అధిక సంఖ్యలో మహిళలు వస్తున్నారు. ఇప్పటికే అధికారులు పలు రూట్లలో వచ్చే వాహనాలకు రూట్ మ్యాప్ ఖరారు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *