నేటి నుంచి ‘ఢిల్లీ చలో’ పునఃప్రారంభం….

రైతు సంఘాలు బుధవారం దేశ రాజధానికి తమ ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో, వారిని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు నగర సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

 

టిక్రీ, సింగు, ఘాజీపూర్ సరిహద్దు పాయింట్ల వద్ద మోహరించిన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు మంగళవారం ఆదేశించారు. టిక్రీ, సింగు సరిహద్దు పాయింట్లు రెండూ భారీగా పోలీసు సిబ్బందిని మోహరించడం, కాంక్రీట్, ఇనుప మేకుల బారికేడ్‌లతో మూసివేశారు. ఘాజీపూర్ సరిహద్దులోని రెండు లేన్లు కూడా మల్టీ లేయర్ బారికేడ్లు, పోలీసు సిబ్బందితో మూసివేశారు. అవసరమైతే, ఘాజీపూర్ సరిహద్దును బుధవారం కూడా మూసివేయవచ్చని పోలీసు అధికారి తెలిపారు.

 

గ్రేటర్ నోయిడాలో ట్రాఫిక్ మళ్లింపులు

భారతీయ కిసాన్ యూనియన్ (టికాయత్) పిలుపునిచ్చిన నిరసన ప్రదర్శన కారణంగా గ్రేటర్ నోయిడా నుంచి బయటకు వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండే అవకాశం ఉందని నోయిడా పోలీసులు మంగళవారం హెచ్చరించారు.

 

నివేదికల ప్రకారం, రైతులు ట్రాక్టర్లు, ప్రైవేట్ వాహనాలపై నాలెడ్జ్ పార్క్ మెట్రో స్టేషన్ వద్ద కలువనున్నారు. ఆ తర్వాత, ఇండియా ఎక్స్‌పో మార్ట్, శారదా యూనివర్శిటీ, ఎల్‌జీ రౌండ్‌ అబౌట్, మోజర్ బేర్ రౌండ్‌ అబౌట్ మీదుగా సూరజ్‌పూర్‌లోని కలెక్టరేట్ వద్ద వారి మార్చ్ ముగుస్తుంది అని పోలీసులు తెలిపారు.

 

అవసరమైతే, గల్గోటియా కట్, ప్యారీ చౌక్, ఎల్‌జి రౌండ్‌అబౌట్, మోజర్ బేర్ రౌండ్‌అబౌట్, దుర్గా టాకీస్ రౌండ్‌అబౌట్, సూరజ్‌పూర్ చౌక్ నుంచి ట్రాఫిక్ మళ్లింపులను ఉంచవచ్చని పోలీసులు తెలిపారు.

 

వచ్చే ఐదేళ్లలో ఐదు పంటలను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి కొనుగోలు చేయాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రతిపాదనను సోమవారం రైతు నాయకులు తిరస్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *