సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం పార్టీ పెద్దలను కలిసే అవకాశమున్నట్టు టీపీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కె.సి.వేణుగోపాల్ సహా వీలును బట్టి మరికొందరు పెద్దలతో వీరు సమావేశమవుతారని తెలుస్తోంది. కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, నితిన్ గడ్కరీని కలవనున్నట్లు సమాచారం.