కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ‘ఢిల్లీ చలో’ ఆందోళన శాంతియుతంగా నిర్వహిస్తామని రైతు నేతలు ప్రకటించారు. కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన అనంతరం వారు మాట్లాడారు. అవి రైతులకు మేలు చేసేవి కాదని, ప్రతిపాదనలపై సంఘాలన్నీ చర్చించుకున్న మీదుట ఈ నిర్ణయానికి వచ్చినట్లు వారు స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లేందుకు వీలుగా బారికేడ్లను తొలగించాలని డిమాండ్ చేశారు.