పెను ప్రమాదం నుంచి బయటపడ్డ రష్మిక..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. బాక్సాఫీసు వద్ధ భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది.

 

ఈ మూవీ తర్వాత రష్మికకు మంచి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె మాత్రం డిఫరెంట్ కథలతో పాటు అందులోని తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటేనే స్టోరీలను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇకపోతే సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తరచూ యాక్టివ్‌గా ఉండే రష్మిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్ చేసింది. ఇటీవల విమాన ప్రయాణంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె తృటిలో చావు నుంచి తప్పించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది రష్మిక.

 

రష్మిక మందన్నా ఇటీవల ముంబై నుంచి హైదరాబాద్‌‌కు విమానంలో ప్రయాణించారు. అయితే టేకాఫ్ అయిన 30 నిమిషాలకే.. ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలిపింది.

 

దీంతో వెంటనే అప్రమత్తమయిన పైలట్.. వెంటనే ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారని చెప్పింది. అయితే ఈ ఘటనతో రష్మిక చాలా కంగారు పడినట్లు తెలిపింది. కాగా ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇకపోతే అదే విమానంలో ఆమెతో పాటు మరో హీరోయిన్‌ శ్రద్ధా దాస్ కూడా ఉన్నారు.

 

అయితే ఈ ఘటనతో ఆమె కూడా భయపడినట్లు తెలిపారు. ఈ విషయాన్ని రష్మిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఈరోజు మేము మృత్యువు నుంచి తప్పించుకున్నాము’’ అంటూ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది.

 

 

ఇకపోతే పుష్ప సినిమా ద్వారా ఫుల్ క్రేజీ అందుకున్న రష్మిక ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘పుష్ప2’ మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *