నమోదుకు తుది గడువు ఈ నెల 27
ఈసారి 76 సహాయ కేంద్రాల్లోనూ అవకాశం
ఈసారి 76 సహాయ కేంద్రాల్లోనూ అవకాశం
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) నమోదు ఈనెల 10వ తేదీన ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉపాధ్యక్షుడు- దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి గురువారం విలేకరులతో మాట్లాడుతూ, 9వ తేదీన ప్రవేశ ప్రకటన జారీ చేస్తామన్నారు. 10 నుంచే విద్యార్థులు పేర్లు నమోదు (దరఖాస్తు) చేయించుకోవచ్చని తెలిపారు. గతేడాది వరకు ‘మీ సేవా’ కేంద్రాలతో పాటు ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నుంచి నమోదు చేసుకొనే సౌకర్యం ఉండేది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 76 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని సహాయ కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. నిరుడు సెల్‌ఫోన్ల ద్వారా 88,000 మంది దరఖాస్తు చేశారని అన్నారు. సమస్యలు తలెత్తినప్పుడు అభ్యర్థులు హైదరాబాద్ ఉన్నత విద్యామండలి కార్యాలయంలోని దోస్త్ విభాగానికి వస్తున్నారని పేర్కొన్నారు.