బీజేపీ నేత నివాసంలో ఐటీ దాడులు..

తెలంగాణలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. తెలంగాణ బీజేపీ నేత అందెల శ్రీరాములు నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. శ్రీరాములు పర్సనల్ అసిస్టెంట్ నివాసంతోపాటు శ్రీరాములు బిజినెస్ పార్ట్నర్ ప్రతిమా రెడ్డి ఇంట్లో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పోలీస్ సిబ్బంది సాయంతో వారి ఇళ్లకు చేరుకున్న ఐటీ అధికారులు.. ఆదివారం ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.

 

లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ నేత నివాసంలో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారాయి. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున మహేశ్వరం నుంచి శ్రీరాములు పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతిలో 26 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

 

కాగా, భారతీయ జనతా పార్టీ నేత అందెల శ్రీరాములు యాదవ్‌ ఇంటితో పాటు ఆయన వ్యాపార భాగస్వామి సామంత్ రెడ్డి నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. వీరి నివాసాల్లో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

 

అయితే, ఈ సోదాల్లో నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎలాంటి స్పష్టత రాలేదు. ఐటీ అధికారులు ఏమీ వెల్లడించలేదు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి కీలక ఫైళ్లు, డాక్యుమెంట్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అందెల శ్రీరాములు ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు సంబంధించిన వ్యవహారాలపై పలు కోణాల్లో ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *