ఇంటర్ విద్యార్థుల మరణాలపై బంద్ కు పిలుపునిచ్చిన బిజెపి నాయకులు


నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో **ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జరిగిన అవకతవకల వలన 23 మంది అమాయక ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు** దీనికి కారణం అయిన గ్లోబరినా సంస్థ పైన, దీనికి సంబంధించిన వారిపైన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. కె. లక్ష్మన్ గత మూడు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. దీని కొరకు * ఈరోజు బీజేపీ తరఫున బిజెపి జిల్లా కార్యదర్శి రాఘవేందర్ గౌడ్. ఉపాధ్యక్షులు కృష్ణ గౌడ్. అభిలాష్ రెడ్డి మాట్లాడారు. ఈ రోజున బీజేపీ రాష్ట్ర బంద్* కి పిలుపుఇచ్చారు. బందులో భాగంగా బిజెపి నాయకులు కల్వకుర్తి లోని బస్ డిపో ఎదురుగా ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన బిజెపి నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన కల్వకుర్తి పోలీసులు. చనిపోయిన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరు పోరాడుదామని బిజెపి నాయకులు తలపెట్టిన తెలంగాణ బంద్ కు వ్యాపారస్తులు ఉద్యోగులు, ఉపాధ్యాయులు విద్యార్థులు , కార్మికులు మరియు వివిధ సంఘాల నేతలు మద్దతు ఇవ్వాలని స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మీ యొక్క సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ బందుకు సహకరించాలని బిజెపి నాయకులు బిజెపి టౌన్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి . రవి గౌడ్ వెంకటేష్ నరేష్ అఖిల్. కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *